telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్‌లో కొనసాగుతున్న పోలింగ్..

తెలంగాణ‌లోని హుజూరాబాద్ అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాజ‌కీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్ ఉత్కంఠ రేపుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ రాత్రి 7 గంటల వరకు జరగనుంది.

మొత్తం 106 గ్రామపంచాయతీల్లో 306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,36,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

Telangana: Election schedule announced for two municipal corporations, five  municipalities | Cities News,The Indian Express

ఉప ఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల పోటీలో భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారుపోలింగ్ విధుల్లో 1,715 మంది సిబ్బంది ఉండగా.. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే ఎన్నికల విధుల్లో నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల విధుల కోసం 20 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నారు. 107 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Women fined for gas cylinder and set out to vote

కాగా..హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గుండెడు గ్రామంలో కొందరు మహిళలు టీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు గ్యాస్ సిలిండర్ కి దండంపెట్టి ఓటు వేయడానికి బయలుదేరారు. సిలిండర్ ధరను పెంచిన బిజెపి వ్యతిరేకంగా ఇలా సిలిండర్ కు దండంపెట్టి టీఆర్ఎస్ కు ఓటేయడానికి కదలాలని మంత్రి హరీష్ తో పాటు మిగతా నాయకులు జోరుగా ప్రచారం చేసారు.

Related posts