telugu navyamedia
రాజకీయ

దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉపఎన్నికల పోలింగ్.

దేశవ్యాప్తంగా ఈరోజు ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది.

కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్‌ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

అదే విదంగా అసోంలోని 5, బంగాల్‌లో 4, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బరిలోకి దిగాయి. ముఖ్యంగా బంగాల్​లో పోరు..దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరుగుతున్నా.. అందరి చూపు బంగాల్​పైనే ఉంది. భాజపా, టీఎంసీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న నాలుగు స్థానాల్లోనూ ప్రధానంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగ‌నుంది.

Related posts