నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లమల అడవి బిడ్డలకు తాను అండగా నిలుస్తానని చెప్పారు.
నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని హెచ్చరించారు. యురేనియం తవ్వకాలకు సహకరిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలని సూచించారు. యురేనియం తవ్వకాలు జరగడంలేదంటూ సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని అన్నారు. సీఎం హామీ ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్