వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారనే ఆకాంక్షతో జగన్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారని తెలిపారు. కానీ ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని దుయ్యబట్టారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో జగన్ ఒకటైనా అమలు చేశారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
45 ఏళ్లకు పెన్షన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేల పెన్షన్, సీపీఎస్ విధానం ఏమయ్యాయనినిలదీశారు.పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా ఏం చేశారని ప్రశ్నించారు.2017లో టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తాము పిలిచిన టెండర్లను రద్దు చేసి ఇప్పుడు కొత్త జీవో ఇచ్చారని విమర్శించారు. తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో 100 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం చూపించిందని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులపై కక్ష ఎందుకు.. జగన్ పై లోకేశ్ విమర్శలు