telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు.. టీఆర్ఎస్ ను చీల్చడానికి ఈటల స్కెచ్ ?

ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తెరాస పార్టీ చీల్చడానికి ఈటెల సాహసం చేసినట్లు సమాచారం అందుతోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న ఈటెల..మొదటి టర్మ్ లోనే పలువురితో మంతనాలు చేసినట్లు తెరాస పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలిసి రెండో టర్మ్ మంత్రి పదవికి దూరం పెట్టాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారని… కానీ సహచర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి తదితరులు సీనియర్ నాయకుడు కాబట్టి మంత్రివర్గంలోకి తీసుకుందాం అని కేసీఆర్ కు నచ్చచెప్పి ఒప్పించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో టర్మ్ మంత్రి పదవి రాగానే తన అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టిన ఈటెల రాజేందర్.. పలు సమావేశాల్లో, ప్రైవేటు మీటింగుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్లు చేయడం ప్రారంభించాడని సమాచారం. గత ఐదేళ్లలో వెయ్యి కోట్ల సంపద వెనుకేసిన ఈటెల… ఈ డబ్బుతో కొత్త పార్టీ పెట్టే సీఎం అవ్వాలని ప్లాన్ వేశాడాని తెరాస పార్టీ వర్గాలు కోడై కుశతున్నాయి. గత నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ని కలిసి కొత్త పార్టీ కోసం సన్నాహాలు చేసుకున్న ఈటెల..ఇక ఉపేక్షిస్తే డేంజర్ అని టీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం కదిలినట్టు సమాచారం. నిన్న ఈటెల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణలు వచ్చిన అర్థగంటలోనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పాటలు, పోస్టర్లు రావడంతో ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నాడు అని కూడా కొందరు రాజకీయ నాయకుల వాదన. అటు టీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ ఈటలకు కొందరు సపోర్ట్ గా పోస్టులు పెడుతుంటే.. మరీకొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక మరికొందరైతే ఈటల, సిఎం కెసిఆర్ లపై ఇప్పుడే ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకూడదని అంటున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో భావిష్యత్తే నిర్ణయించనుంది.

Related posts