telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సింగ్‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వం…

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది.. అయితే ఇది ఆత్మహత్య కేసు అని ముంబై పోలీసులు చెప్పినప్పటికీ, ఇది హత్య అని సుశాంత్ కుటుంబంతో పాటుగా పలువురు అన్నారు. అంతేకాకుండా ముంబై పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని డిమాండ్ చేయడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి వెల్లడించింది. అనంతరం ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. అయితే ఇప్పటికీ ఈ కేసు ఎటూ తేలకపోవడం గమనార్హం. సుశాంత్‌ సింగ్‌ మృతిని ఆయన ఫ్యాన్స్‌, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే…నిన్న అనగా గురువారం రోజు సుశాంత్‌ జయంతి కాగా.. దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రూస్‌ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్‌ రోడ్డుకు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డులో ఎక్కువ మంది బీహార్‌ వాసులే నివసిస్తున్నారని… ఇందుకోసం ఆ రోడ్డుకు సుశాంత్‌ పేరు పెట్టాలని సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభిషేక్‌ దత్‌ గత ఏడాది ప్రస్తావనకు తెచ్చారు. జనవరి 21న అమలులోకి తీసుకువచ్చారు. ఇది సుశాంత్‌కు దక్కిన అరుదైన గౌరవం అని ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు.

Related posts