కర్నాటక స్పీకర్ రమేశ్ కుమార్ ఇవాళ మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రేపు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని స్పీకర్ నిర్దేశించారు.
విధానసభ వద్ద స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 31 లోగా ఆర్థిక బిల్లు ఆమోదం పొందాల్సి ఉందన్నారు. రేపు విశ్వాస పరీక్ష నిర్వహించాలని సీఎం యడ్యూరప్ప కోరారు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని సీఎం తెలిపారని స్పీకర్ పేర్కొన్నారు.