telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4″లోకి హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ

Swathi Dixit

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సీజన్ లో అంతా కొత్త కంటెస్టెంట్లు అయినప్పటికీ మంచి వినోదాన్ని, తమదైన ఎమోషన్స్‌ను పండిస్తున్నారు. ఇంటి సభ్యుల్లో మెహబూబ్‌, అరియానా, కుమార్‌, మోనాల్‌, హారిక, లాస్య, దేవిలతో కలిసి ఈ వారం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. మరి ఈ ఏడుగురిలో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే. అయితే తాజాగా ఐపీఎల్ మొదలవ్వడం తో బిగ్ బాస్ జోష్ తగ్గిపోతుందని టాక్ వినిపిస్తోంది. దాంతో బిగ్ బాస్ నిర్వహకులు సైతం రేటింగ్ పడిపోయే ఛాన్స్ ఉందని గ్రహించినట్టున్నారు. దాంతో ఇప్పటికే మొదటి రెండు వారాల్లో ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలోకి పంపించారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ ను కూడా హౌస్ లోకి పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. ఐపీఎల్ ను ఢీకొట్టేందుకు హాట్ హీరోయిన్ ను హౌస్ లోకి పంపించనున్నారట. జంప్ జిలానీ హీరోయిన్ స్వాతి దీక్షితే ను హౌస్ లోకి పంపించనున్నట్టు సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లిన ముక్కు అవినాష్ హౌస్ మేట్స్ కు దగ్గరైపోగా కుమార్ సాయి మాత్రం ఒంటరిగానే ఉంటున్నాడు.

Related posts