telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ మలయాళ నటి కేవీ శాంతి కన్నుమూత

KV Shanthi

ప్రముఖ మలయాళ నటి కేవీ శాంతి మరణించారు. శాంతి మృతిపట్ల పలువురు దర్శకులు, నటీనటుల సంతాపం తెలిపారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమెకు కుమారుడు శ్యామ్ కుమార్ ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె కొట్టాయం లోని ఎత్తూమనూర్ లో జన్మించారు. చిన్న వయస్సులోనే చెన్నైకి వచ్చారు. సినిమాల్లో నటించడమే కాకుండా, నర్తకిగా ఆమెకు మంచి పేరుంది. ఉదయ్ శంకర్ సెంటర్ ఫర్ డాన్స్ కు ప్రధాన నృత్యకారిణిగా ఎంపికయ్యారు. ఆ తరువాత కేవీ శాంతి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. 1953లో విడుదలైన పదాత పెయిన్కిలి చిత్రంలో నటిగా శాంతి అరంగేట్రం చేశారు. ఆమె మలయాళంలో 50 కి పైగా చిత్రాలలో, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లోని చిత్రాలలో కూడా నటించారు. ఆమె చివరిసారిగా 1975 లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు.

Related posts