telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ?

Venkatesh

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం, 74వ చిత్రం ‘నారప్ప’. ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. వెంకీ 75వ సినిమాను అనీల్ రావిపూడితో ఎఫ్3 చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. తాజాగా తమిళ దర్శకుడు మిలింద్ రావ్ కూడా ఆ జాబితాలో చేరాడని సమాచారం. మిలింద్ రావ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంకటేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. మిలింద్ రావ్ ప్రస్తుతం వెంకీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అతి త్వరలోనే మరోసారి వెంకీని కలిసి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించే అవకాశం ఉందని సమాచారం. వెంకటేష్ వచ్చే ఏడాది సమ్మర్ నుండి కొత్త సినిమాలో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ తో సినిమా చేయడానికి ఇప్పటికే పలువురు దర్శకులు లైన్ లో ఉన్నారు. అందులో పూరీ, త్రివిక్రమ్ తో కూడా వెంకీ సినిమాలు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

Related posts