telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వంశీతో పాటు వెళ్ళే వాళ్ళు 532 మంది… లిస్ట్ బయటకు వచ్చేసింది…!?

Vamsi

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నట్టు, చంద్రబాబుకి మెసేజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వంశీ రాజీనామా లేఖ అయితే అటు పార్టీకి కాని, అటు స్పీకర్ కి కాని అందలేదు. ఈ తరుణంలో చంద్రబాబు, కేశినేని నానిని, కొనకళ్ళని, వంశీ దగ్గరకు పంపిస్తున్నా అని చెప్పారు. అయితే, ఇది అంతా ఒకవైపు సాగుతూ ఉండగానే, గన్నవరంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు సమావేశం అయ్యారు. ఇలా కష్టకాలంలో కార్యకర్తలను వదిలేసి వెళ్ళిపోవటం మంచిది కాదని, పోరాడదాం అని, టిడిపిలోని పుట్టాం, టిడిపిలోని చచ్చిపోదాం అని మరి కొంత మంది, తమా వాదన వినిపించారు. కొంత మండి మాత్రం, వంశీ అనుచరులుగా గుర్తింపు వచ్చిందని, వంశీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే తీసుకుంటాం అని, వంశీ వెంటే ఉంటాం అంటూ మరికొంత మంది, తమ నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తంగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.

సమావేశం ముగిసిన తరువాత, చాలా మంది వంశీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, కొంత మంది మాత్రం, వంశీతో పాటే మేము కూడా ప్రయాణం చేస్తామని, వారు కూడా టిడిపి పార్టీకి రాజీనామా చేసారు. అయితే వీరిలో చెప్పుకోతగ్గ నేతలు, ఇద్దురు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరికి నియోజకవర్గంలో కొద్దిగా పేరు ఉన్నా, వారు టిడిపి పుణ్యమా అని నాయకులు అయిన వారే. అయితే మేము కూడా రాజీనామా చేస్తున్నాం అని చెప్పిన వారి లిస్టు లో, చిన్న చిన్న పదవులు ఉన్న వారు, ఇది వరకు పదవులు చేపట్టిన వారు ఉన్నారు. మొత్తంగా, 17 మంది పేర్లు మీడియాకు ఇచ్చి, వీరితో పాటు, 532 మంది వంశీతో పాటు వెళ్తూ, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆ 532 మంది ఎవరు అనేది మాత్రం తెలియదు. వీరిలో ఇద్దురు ముగ్గురు మినహా, మిగతా వారు, కనీసం 10 ఓట్లు కూడా ప్రభావితం చేసే నాయకులు కాదు. అంటే వంశీ వెళ్ళిపోవటం, ఈ 532 మందికి తోడూ, వారి ఇంట్లో వారిని కలుపుకుంటే, గట్టిగా 2 వేలు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాత్రం గమనించాలి. సహజంగా పార్టీ మారే సమయంలో ఇలా వారి అనుచరులు కూడా, నేతలతో పాటు పార్టీ మారతారు. అయితే ఇక్కడ వంశీ మాత్రం రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పారు. అంటే ఈ 532 మంది కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? వంశీతో పాటే మా ప్రయాణం అంటే ఇంతేనా ? లేక దీని వెనుక ఏమైనా స్కెచ్ ఉందా అనేది చూడాల్సి ఉంది.

Gannavaram-2

Gannavaram

Related posts