telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సామాజిక

టీటీడీ బోర్డుని రద్దు .. కొత్త నీటితో..

ttd board may cancelled

ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, త్వరలో టీటీడీ బోర్డుని రద్దు చేస్తామని చెప్పారు. టీటీడీలో అభివృద్ధికి ఆటంకం కలగకుండా నూతన పాలకమండలిని నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాలపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని మంత్రి చెప్పారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై టీటీడీ అధికారులతో సమీక్షిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా ప్రస్తుత పాలక మండలిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీవారి బంగారం తరలింపుపై విచారణ జరిపిస్తామన్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. టీటీడీలో తలెత్తిన అన్ని వివాదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పురాతన నాణేలతో తయారు చేసిన మెమెంటో వివాదాలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Related posts