telugu navyamedia
క్రైమ్ వార్తలు

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..పసికందు మృతి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కార‌ణం ముక్కుపచ్చలారని బాలుడు బలైపోయాడు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఓ కారు చేసిన బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు.

వివార్లాలోకి వెళితే..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్ నుంచి టిఆర్ నెంబర్ తో ఉన్న వాహనం తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బ్రిడ్జిని దాటి , రోడ్డు నెంబర్ 1/45కూడలి వైపు వేగంగా వెళ్తున్న‌ మహేంద్ర థార్ కారుఅదుపుతప్పి… మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన బెలూన్లు అమ్ముకునే ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో మహిళలతో పాటు ఏడాది చిన్నారికి గాయాలయ్యాయి. రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కారు నడిపింది బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ డ్రైవర్‌గా అనుమానిస్తున్నారు. కారు ఓ ప్రైవేట్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేరుతో రిజిస్టర్‌ అయినట్టుగా గుర్తించారు. పరారైన డ్రైవర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts