telugu navyamedia
ఆంధ్ర వార్తలు

భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ..

వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు తెలిపారు

భార‌తీయుల ఐక్యత‌కు ప్రతీక‌గా నిలిచే హోలీని దేశ ప్రజ‌లంద‌రూ ఉల్లాసంగా ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. హోలీ వేడుక‌ల ప్రాశ‌స్త్యాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

మన దేశంలో వివిధ పేర్లతో, వివిధ పురాణాల నేపథ్యంలో ఈ పండుగ జరుపుకొంటు-న్నప్పటికీ భారతీయలు ఐక్యతకు ప్రతీకగా హోలీ శతాబ్దాల తరబడి విరాజిల్లుతోందని పేర్కొన్నారు.

రంగులు, పూల సమ్మేళనంతో నిండి ఉండే ఈ పండుగలానే ప్రజలందరి జీవితాల్లో మంచి ఆరోగ్యం, సుఖ శాంతులు విరబూయాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నానన్నారు. హోలీ వేడుక‌ల‌ను స‌హ‌జ‌సిద్ధమైన రంగుల‌తోనే నిర్వహించుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

Image

Related posts