telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇలాంటి మూర్ఖపు పాలకుడిని చూడటం ఇదే మొదటిసారి : జగన్ పై చంద్రబాబు నిప్పులు

chandrababu speech on 12 hrs diksha

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు పోరాడుతున్నారు. అమ‌రావ‌తి ఉద్యమానికి నేటికీ 500 రోజులు. ఈ సందర్బంగా ఏపీ సిఎం జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజారాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు. తన పాలనలో తాను తీసుకున్న తుగ్లక్ నిర్ణయానికి సుమారు 29 వేల మంది రైతులు బాధపడుతూ దీక్షలు చేస్తోంటే, 500 రోజులలో ఒక్కసారైనా వారిని కలిసి మాట్లాడని మూర్ఖపు పాలకుడిని చూడటం చరిత్రలో ఇదే మొదటిసారి. “కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!” అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం, తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తోన్న మహిళలను బూటు కాళ్ళతో తన్నించినందుకే రాష్ట్రానికి ఇన్ని ఉపద్రవాలు. పాలకులు ఎంత నిర్దయగా ప్రవర్తిస్తున్నా, ప్రజా రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు 500 రోజులుగా శాంతియుతంగా నిరాటంకంగా తమ ఆందోళనను కొనసాగిస్తోన్న రైతులు, రైతు కూలీలు, మహిళలకి అంతిమ విజయం దక్కాలని ఆశిస్తున్నాను.” అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Related posts