telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మాస్కులను విడుదల చేసిన లవ్ స్టోరీ…

కరోనా కారణంగా మాయస్కులు తప్పనిసరి కావడంతో… రకరకాల మాస్క్‌లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమా పోస్టర్‌తో కూడా కొన్ని మాస్క్‌లు వచ్చాయి. అవి ప్రస్తుతం ట్రెండీగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే అక్కినేని కుటుంబం నుంచి వచ్చి సక్సెస్ అందుకున్న హీరో నాగచైతన్య. తనదైన కథల ఎన్నికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సాయి పల్లవి తన నాచురల్ బ్యూటీతో కుర్రకారు గుండెల్లో గంటలు మోగించింది. వీరిద్దరు జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా లవ్‌స్టోరీ. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. థియేటర్లు తెరుచుకుంటే రిలీజ్ అయ్యేందుకు సంసిద్దంగా ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ సినిమా పేరుతో మాస్క్‌లు రావడంతో సినిమాకు అవి మంచి ప్రకటనా మాధ్యమంగా నిలుస్తున్నాయి. ఈ సినిమా మంచి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనిని శ్రీ వేంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై శ్రీ నారాయణదాస్ నారంగ్, పీ రామ్ మోహన్ రావుగారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Related posts