telugu navyamedia
రాజకీయ

ద‌ట్ట‌మైన పొగ‌మంచులో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాప్టర్..

తమిళనాడులో బుధవారం జరిగిన ఆర్మీ హెలికాప్ట‌ర్ ఎంఐ-17 వీ5 ప్రమాదంలో మరణించిన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు ఆర్మీ అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్‌ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో  ఓ వీడియో బయటకు వచ్చింది.

దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు ఆ వీడియో తీసిన‌ట్లు తెలుస్తోంది.

ఊటీలో ఉన్న టూరిస్టులు కొంద‌రు కింద న‌డుచుకుంటూ త‌మ సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీస్తున్నారు. అయితే ఆ స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ పేలిన‌ట్లు ఆ వీడియోలో శ‌బ్ధం వినిపిస్తోంది.  ఇక ఆ వీడియోలో ఉన్న వాళ్లు.. పేలిపోయిందా.. కూలిపోయిందా అనుకుంటూ త‌మిళ భాష‌లో  మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది.

IAF MI 17V5 Helicopter Crash Video: Watch: New video captures Gen Bipin Rawat's IAF Mi-17V5 chopper moments before the crash - The Economic Times Video | ET Now

మ‌రో వైపు 5 కిలోమీటర్ల దూరంలో గమ్యం అనగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ-17వి5 హెలికాప్టర్‌.. పొగమంచు లేకపోతే రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్‌లో దిగేది. అంతలోనే ఇలా అయిపోయింది.

కాగా.. త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13మందికి పలువురు నివాళులు అర్పించారు. గురువారం ఉదయం వారి భౌతికకాయాలతో కూడిన శవపేటికలను జాతీయ జెండా కప్పి పూలతో అలంకరించిన సైనిక వాహనంలో వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రి నుంచి మద్రాస్‌ రెజిమెంటల్ కేంద్రానికి తరలించారు. ధికారులు, సైనికాధికారులు బిపిన్‌ రావత్‌సహా 13మందికి పుష్పాంజలి ఘటించారు.

Related posts