telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేసీ, పెద్దారెడ్డిల మధ్య ముదిరిన పోరు…

ఏపీలో రోజురోజుకు జేసీ, పెద్దారెడ్డిల మధ్య పోరు ముదురుతుంది.  పెద్దారెడ్డి, అతని అనుచరులు జేసీ ఇంటికి వచ్చి ఇంట్లోని ఇద్దరు యువకులపై దాడులు చేయడంతో వివాదం మొదలైంది.  ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు రాళ్ళూ రువ్వుకున్నారు.  పోలీసులు జోక్యం చేసుకున్నా రగడ మాత్రం తగ్గలేదు.  జేసీ లాయర్ ఫిర్యాదుతో పెద్దారెడ్డి, అతని తనయుడు హర్షవర్ధన్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, మరో రెండు కేసులు పెట్టమని డిఎస్పీ చెప్పారు.  సీసీ కెమెరా ఫుటేజ్ ను సీఎస్, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, డిఎస్పీ, సిఐలకు ఇచ్చామని జేసీ యాలార్ పేర్కొన్నారు.  అయితే తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని జేసీ లాయర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.  పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన సమయంలో తాను, తన కొడుకు ఇంట్లో లేమని అన్నారు.  తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు.  కేసులు పెట్టాలంటే ముందు పెద్దారెడ్డికి చెందిన 9 మంది గన్ మెన్ లపై పెట్టాలని అన్నారు.  ఫుటేజ్ ఆధారంగా కేసులు పెట్టమంటే పైనుంచి తమపై ఒత్తిడి ఉందని పోలీసులు చెప్తున్నారని జేసి పేర్కొన్నారు.  ఎమ్మెల్యే పెద్దారెడ్డి చంబల్ లోయలో ఉండాల్సిన వ్యక్తి అని, 1990లో ఇళ్ళు తగలబెట్టి బీరువాలో డబ్బులు ఎత్తుకెళ్లారని జేసీ పేర్కొన్నారు. 

Related posts