టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడికి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగిందని, అలాంటి వ్యక్తిని బలవంతంగా తీసుకెళతారా అంటూ మండిపడ్డారు. మీ కక్ష సాధింపు చర్యలకు అంతులేదా అంటూ సీఎం జగన్ ను సూటిగా ప్రశ్నించారు.
మీకు అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా అని నిప్పులు చెరిగారు.అచ్చెన్నాయుడుపై ఆరోపణలన్నీ కల్పితాలేనని అన్నారు. విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్న పేరు లేదని అన్నారు. ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్ , విజయ్ ల పేర్లు మాత్రమే రిపోర్టులో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. మరీ దుర్మార్గంగా అచ్చెన్న ఇంటికి వెళ్లి అరెస్ట్ గురించి చేతితో రాసిస్తారా అని మండిపడ్డారు.