telugu navyamedia
రాజకీయ వార్తలు

బల పరీక్షపై కమల్​ నాథ్​ ప్రభుత్వానికి నోటీసులు

Kamal_Nath mp

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బల పరీక్ష నిరూపనపై కమల్ నాథ్ సర్కారుకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 24 గంట్లలో దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీలో తక్షణం బల పరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై అత్యవసరంగా విచారణ జరిగింది.

పిటిషన్‌ ను విచారించిన జస్టిన్ డీవై చంద్రచూడ్, హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం దీనిపై బుధవారం 10.30 నిమిషాల లోపు సమాధానం చెప్పాలని కమల్ నాథ్ సర్కారును ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.మరోవైపు కమల్ నాథ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా తమపై ఎవ్వరూ ఒత్తిడి తేవడంలేదని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుపీంకోర్టుకు తెలియజేశారు.

Related posts