రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ పథకం ఎత్తేసేందుకే నగదు బదిలీ తీసుకువస్తున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితే వస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని ధర్నాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని బాలినేని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని, చంద్రబాబు అన్నారని తెలిపారు. ఉచిత విద్యుత్ కు మంగళం అంటూ టీడీపీ లేనిపోనీ ఆరోపణలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు