telugu navyamedia
రాజకీయ

భగ్గుమన్న బొగ్గు కార్మికులు..

కేంద్రప్రభుత్వ విధానాలపై బొగ్గు కార్మికులు భగ్గుమన్నాయి… సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. మూడు రోజులపాటు నిర్వహింప తలపెట్టిన సమ్మెతో గనుల్లో బొగ్గు తవ్వకాలు స్తంభించాయి. అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి రావడంతో సమ్మె విజయవంతమైంది. సింగరేణి చరిత్రంలో కార్మిక సంఘాలన్నీ ఒకే తాటిపైకొచ్చి… విధులు బహిష్కరించిన దాఖలాల్లేవు. జాతీయ కార్మిక సంఘాలు, గుర్తింపు పొందిన కార్మిక సంఘం మద్దతుతో విధులు బహిష్కరించడంతో తొలిరోజు సమ్మె సఫలమైంది.

సింగరేణిలో బొగ్గు బ్లాకులను వేలం వేయాలని భావిస్తున్న కేంద్రం నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ప్రయివేటీకరణను నిరసిస్తూ సమ్మెకు పూనుకున్నాయి. గుర్తింపు సంఘంతో పాటు జాతీయ సంఘాలన్ని ఏకతాటిపైకొచ్చి నిరసనప్రదర్శన నిర్వహించారు. లాభాల్లో ఉన్న సింగరేణి పట్ల కేంద్రం అవలంభిస్తున్న విధానంపై కార్మికులు మండిపడుతున్నారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మెలో అందరూ భాగస్వాములు అయ్యారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో జరిగే సమ్మె పై మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ 2 ఫేస్ .

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలు హోరెత్తించారు.. జాతీయ సంఘాలతో పాటు సింగరేణి గుర్తింపు సంఘం TBGKS మద్దతుతో మొదటి రోజు సమ్మె విజయవంతమైంది. కార్మికులు మొదటి షిఫ్ట్ నుండే విధులు బహిష్కరించి సమ్మెను విజయవంతం చేశారు.

పోరాటంతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ..సింగరేణికి చెందిన నాలుగుబొగ్గు బ్లాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యజమాన్యం ప్రయత్నిస్తోందని అన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకై యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

Singareni collieries company News - Latest singareni collieries company News, Information & Updates - Energy News -ET EnergyWorld

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణికి విలువైన బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణలో వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు నినాదాలు హోరెత్తించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మణుగూరు సింగరేణి బొగ్గు గనుల్లో కార్మిక సంఘాలు నాయకులు సమ్మెకు దిగారు. అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకొచ్చి విధులను బహిష్కరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సింగరేణి బొగ్గు గనుల్లో మెరుపు సమ్మెకు దిగడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక సంఘాలు పార్టీజెండాలు పక్కకు పెట్టి అందరూ సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి చరిత్రలో అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొని, సమ్మె విజయవంతం అయిన దాఖలు లేవనే అభిప్రాయం కార్మికులు వ్యక్తంచేశారు. కార్మికుల సంఘీ భావంతో సమ్మె విజయవంతమైందన్నారు. ప్రధానంగా బొగ్గు గనుల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు వెలికితీత పనులను ప్రైవేటు వారికి అప్పగించ వద్దని నినాదాలు చేశారు.

Related posts