telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గురువుగా బుద్ది చెప్పినందుకు…ఉపాధ్యాయుడిపై విచక్షణలేకుండా దాడి..

students beaten teacher in

గురువు శిష్యులను బిడ్డలుగా తలచి, తప్పుడు దారులలో వెళుతుంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. దానిని కూడా ఏదో ఉపద్రవం లా భవిస్తూ, ఉపాధ్యాయుడిదే తప్పు అన్నట్టుగా నేటి తరం సహా వారి కుటుంబాలు కూడా భావిస్తుండటం విచారకరం. దీనికి సాక్ష్యంగా తాజాగా, ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని కొట్టారు. ఈ సందర్భాలు విద్యార్థులలో అశాంతి ఏ స్థాయిలో పెరుగుతున్నాయి అనేది చెపుతున్నట్టే ఉంది.

విద్యార్థినిలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారంటూ తిట్టాడన్న కోపంతో విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టీచర్ పై దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రయాగ్ రాజ్ ఎస్పీ తెలిపారు. ఇటువంటి వాటిలో శిక్ష మానసికంగా పరిపక్వతను తెచ్చేదిగా ఉండాలి కానీ ఆయా యువకులను చెడువైపుకు ప్రేరేపించినట్టు ఉండకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగమైన తల్లిదండ్రులకు కూడా అటువంటి మానసిక పరిపక్వత అవసరం అంటున్నారు.

Related posts