telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ రోల్ మరోసారి కనిపించనున్న ‘Rx 100’బ్యూటీ!

తెలుగులో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం ‘ఆర్ఎక్స్ 100’, తర్వాత ‘ఆర్‌డిఎక్స్ లవ్’తో గ్లామర్ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసినప్పటికీ, పాయల్ రాజ్‌పుత్‌ను గ్లామర్ భామగా మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. ఆ తర్వాత ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ మూవీతో ఓటీటీ వరల్డ్ లో ఎంటరైంది. అయినా అమ్మడిని సక్సెస్ పలకరించలేదు. తాజాగా తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఆహా తీస్తున్న ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ లో పాయల్ అవకాశం దక్కించుకుందట. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో కూడా పాయల్ సీరియస్ పాత్రనే పోషిస్తోందని సమాచారం. ఓ విధంగా చెప్పాలంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేస్తున్నట్లు టాక్. తెలుగులోనే కాదు పాయల్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో ‘ఏంజెల్’ అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తోంది. మరి రాబోయే కాలంలో పాయల్ స్టార్ స్టేటస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Related posts