telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : గాంధీలో సస్పెండైన డాక్టర్ వసంత్… సూసైడ్ చేసుకుంటానంటూ ఆసుపత్రి ఎదుటే…!?

Gandhi

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం హైడ్రామా చోటు చేసుకుంది. కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపణలతో సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో డాక్టర్ వసంత్ ను ప్రభుత్వం సోమవారం, ఫిబ్రవరి 10న సస్పెండ్ చేసింది. తాను చెయ్యని తప్పుకు బలి అయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మంగళవారం ఉదయం గాంధీ లో వీరంగం సృష్టించారు. ఒంటికి పెట్రోల్ బాటిల్స్ కట్టుకుని..లైటర్ చేత్తో పుచ్చుకుని ఆయన ఆస్పత్రి సూపరింటెండ్ పై ఆరోపణలు గుప్పించారు. చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా డాక్టర్ వసంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా వచ్చిందని ఆయన ప్రచారం చేసారనే అభియోగంతో సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీవ్రంగా పరిగణించి డాక్టర్ వసంత్ ను సస్పెండ్ చేసింది. డాక్టర్ వసంత్ గాంధీ ఆసుపత్రిలో సీఎంవోగా విధులు చేస్తున్నారు. కాగా… పుకార్లను ప్రచారం చేసినందుకే డాక్టర్ వసంత్ పై వేటు పడిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇది ఒక్కటే కారణం కాదని.. గత ఏడాదిగా.. పాలన పరంగా సదరు డాక్టర్ ఇబ్బందులు పెట్టారని చెప్పారు. కాగా, వ్యక్తిగత కక్షతో డాక్టర్ పై చర్యలు తీసుకున్నామన్నది అవాస్తవం అన్నారు. మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో డాక్టర్ వసంత్ ఒంటికి పెట్రోల్ బాటిల్స్ కట్టుకుని వచ్చి ఆస్పత్రి సూపరిెటెండ్ పై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలోని తప్పులు ఎత్తి చూపుతున్నందుకే తనపై వేటు వేశారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను మంగళవారం ఉదయం ఆయన కలిసివప్పటికీ మంత్రి నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆయన ఆత్మహత్యా యత్నం చేసుకోటానికి ప్రయత్నించారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్ శ్రావణ్ అవినీతికి పాల్పడుతున్నాడని..ఆస్పత్రిలో మందుల కొరత ఉందని…..సీనియర్ డాక్టర్లు ఉన్నా వారికి ఎవరికీ సరైన ప్రమోషన్లు ఇవ్వటంలేదని….. ఆస్పత్రిలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆయన్ను ఆత్మహత్యా చేసుకోకుండా నివారించాలని ప్రయత్నం చేయగా ఆయన కాల్చుకోటానికి ప్రయత్నించారు. సిబ్బంది లేక పోయినా సూపరింటెండెంట్ పట్టించుకోవటంలేదని… సిబ్బందిలేనప్పుడు కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని తెలిపారు. ఆస్పత్రిలో ప్రతి పనికి లంచాలు అడుగుతున్నారని… ఆస్పత్రిలో డాక్టర్లకు అవసరమైన పనులకు కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts