ఒడిశాలోని తరవా పోలీస్‌స్టేషన్ భారత్‌దేశంలోనే ఉత్తమమైన పోలీస్‌స్టేషన్‌గా రికార్డుల్లోకెక్కింది. సుబర్నాపూర్ జిల్లాలోని తరవా పోలీస్‌స్టేషన్ ఇండియాలోని ది బెస్ట్ టాప్ 10 పీఎస్‌లలో మొదటిస్థానంలో నిలిచిందని అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. వివిధ విభాగాల్లో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న పోలీస్‌స్టేషన్లలో తరవా పీఎస్‌కు ఈ ఘనత దక్కింది.
మొదటి స్థానాన్ని సాధించిన ధ్రువీకరణ పత్రం, మెమోంటోను సుబర్నాపూర్ ఎస్పీ దేవీ ప్రసాద్ దాస్‌కు డీజీపీ ఓపీ శర్మ అందజేశారు. స్మార్ట్ పోలీసింగ్, పౌరసేవల్లో సాంకేతికత వినియోగం, పీపుల్ ఫ్రెండ్లీ, వుమెన్, చిల్డ్రన్ ఫ్రెండ్లీ పాలిసింగ్ తదితర సేవల ఆధారంగా ఉత్తమ పోలీస్‌స్టేషన్‌ను ఎంపిక చేశారు. హోంమంత్రిత్వ శాఖ ఈ మెమోంటోను ప్రదానం చేసింది.
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి