telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆర్మీ ఆఫీసర్ గా అందాల సుందరి…!!

Garima-Yadav

హరియాణాకు చెందినగరిమా యాదవ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. గరిమా మిస్ ఇండియా ఛార్మింగ్ ఫేస్-2017 కిరీటాన్ని సొంతం చేసుకుంది. సిమ్లాలోని ఆర్మీ స్కూల్లో చదువుకున్న ఈ సుందరి ఫ్యాషన్ లోకంలోకి అడుగుపెట్టింది. అయితే సాధారణంగా ఫ్యాషన్ రంగంలో ఉండే అమ్మాయిలు సినిమాల వైపు మొగ్గుచూపుతారు. కానీ గరిమా మాత్రం అడపాదడపా అందాల పోటీల్లో పాల్గొన్నప్పటికీ లక్ష్యాన్ని మరవకపోవడం విశేషం. న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి, తరువాత కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది గరిమా. అనంతరం చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ)లో చేరి శిక్షణ తీసుకుంది. సైన్యంలో చేరాలన్న పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు కూడా చేపట్టింది ఈ బ్యూటీ. లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన గరిమా మాట్లాడుతూ శిక్షణ సమయంలో తొలుత కొంత ఇబ్బంది పడినప్పటికీ పట్టుదలతో శిక్షణ పూర్తి చేశానని, తొలుత మనలోని బలహీనతలను అంగీకరించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తే విజయాన్ని అందుకోవచ్చని తెలిపింది.

Related posts