telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ-టీం : రఘునందన్‌రావు

Raghunandan

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారన్న వీ.హెచ్‌ మాటలు నిజమయ్యాయని అన్నారు. కేటీఆర్ తన చుట్టూ రాక్షసులను ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని బాల్క సుమన్ గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడెందుకు మాట్లాడడం లేదన్నారు. ఓటమి భయంతోనే ఈటల పేరుతో తప్పుడు లేఖల వస్తున్నాయని రఘునందన్‌రావు అన్నారు.

Related posts