దశలవారిగా మధ్య నిషేదం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నూతన ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు జరుగనున్నాయి. బేవరెజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3,500 మద్యం షాపులను నిర్వహించనున్నారు.
దశలవారీగా మద్యం నిషేధంలో భాగంగా షాపుల సంఖ్యను 800కు పైగా ప్రభుత్వం తగ్గించింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో మద్యం షాపులను తొలగించనున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులపై నిషేధం విధించింది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.