telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫెర్టిలిటీ సెంటర్ లో తన వీర్యాన్నే మహిళలకు ఎక్కిస్తూ… ఏకంగా 15 మందికి తండ్రైన డాక్టర్… !?

Canada

కెనడాలో బెర్నార్డ్ నార్మన్ బార్విన్ అనే 80 ఏళ్ళ ఫెర్టిలిటీ డాక్టర్ లైసెన్స్‌ను ఆంటారియో డిసిప్లినరీ ప్యానెల్ రద్దు చేసింది. సంతానోత్పత్తి కేంద్రంలో ఒకరి వీర్యం బదులుగా మరొకరి వీర్యాన్ని అనేక దశాబ్దాల పాటు మహిళలకు ఎక్కిస్తూ వస్తున్నట్టుగా రుజువైంది. ఒక కేసులో ఏకంగా తన వీర్యాన్నే ఎక్కించడంతో 25 ఏళ్ల తరువాత బెర్నార్డ్ వీర్యం ద్వారా పుట్టిన యువతి తన బయోలాజికర్ తండ్రి బెర్నార్డ్ అని తెలుసుకోవడంతో ఈ దారుణమైన విషయం బయటపడింది.  బెర్నార్డ్ తన అసలు తండ్రి అని తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు తన తండ్రిగా ఉన్న వ్యక్తి ఈ వార్త విని కుమిలిపోతున్నాడని, బెర్నార్డ్ వీర్యంతో జన్మించిన 15 మందిని తాను ఇప్పటివరకు గుర్తించానని, తాను తన కుటుంబ లైఫ్ సైకిల్ గురించి పరిశోధించకపోతే ఈ నిజం ఎప్పటికీ బయటపడేది కాదని రెబెక్కా డిక్సన్ అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బెర్నార్డ్ దాదాపు నలభై ఏళ్లుగా కొన్ని వందల మందికి ఇలా వేరొకరి వీర్యాన్ని ఎక్కిస్తూ వచ్చినట్టు సర్జన్లు, ఫిజీషియన్లు గుర్తించారు. దాదాపు 100 మంది దీనిపై ఫిర్యాదు చేయగా.. అందులో బెర్నార్డ్ వీర్యం ద్వారా పుట్టినట్టు ఇప్పటివరకు 11 మంది ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

Related posts