telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా” వేడుకకు పవర్ స్టార్ తో పాటు రెబల్ స్టార్ కూడా…!!

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై ద‌ృష్టి సారించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను వచ్చే నెల మూడో వారంలో భారీగా నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందట. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన ప్రముఖులతోపాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం.

Related posts