telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహర్షి టీజర్ .. ఉగాదికేనట… !

mahesh babu movie maharshi second lookf

మహర్షి చిత్రం టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. మహేశ్ కథానాయకుడిగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి వుంది. ఏప్రిల్ రెండవ వారంలో ఈ పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా ఏప్రిల్ 6వ తేదీన వదలాలనే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి , దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. దేవిశ్రీ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related posts