స్విస్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులతో కూడిన బృందం మానవ చర్మం తరహాలోనే స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉన్న కృత్రిమ చర్మాన్ని సిలికాన్, ఎలక్ట్రోడ్‌లతో స్విట్జర్లాండ్‌లోని అభివృద్ధి చేసింది. మృదువైన సెన్సర్లు, యాక్చువేటర్లను అందులో పొందుపరిచింది. వాస్తవ పరిమాణానికి నాలుగు రెట్ల వరకు సాగదీసినా కృత్రిమ చర్మం ఏమాత్రం దెబ్బతినదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతానికి వ్యక్తుల మణికట్టుకు అది అతికినట్లు అమరుతోందని వెల్లడించారు.
ప్రమాదాల్లో గాయపడినవారు త్వరగా కోలుకోవడంలో, మానవులు-కంప్యూటర్ల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చడంలో, వర్చువల్ రియాలిటీ (వీఆర్) వినియోగాన్ని పెంచడంలో తాజా ఆవిష్కరణ దోహదపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు.