telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైపర్ ఆది కౌంటర్ కి నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్

hyper

అదిరింది షోను ఉద్దేశించి హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అదిరింది షోలో ఆర్టిస్టు సద్దాం స్కిట్స్ మంచి ఆదరణ పొందుతున్నాయి. భవిష్యత్తులో మరింత ఆదరణ వస్తుందని నాగబాబు భావిస్తున్నారు. అయితే సద్దాంను హైపర్ ఆదితో పోలుస్తూ నెట్టింట ప్రచారమైంది. దీనిపై హైపర్ ఆది ఓ ఇంటర్య్వూలో కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది. తన స్కిట్‌కు వచ్చిన హైయ్యస్ట్ వ్యూస్ 58 మిలియన్ అని.. అలాగే 30 మిలియన్ దాటిన స్కిట్స్ రెండు ఉన్నాయని.. 20 మిలియన్ దాటిన స్కిట్స్ 5 ఉన్నాయని.. 10 మిలియన్ దాటిన స్కిట్స్ 40 ఉన్నాయని ఇవన్నీ ఆల్ టైమ్ రికార్డులు అంటూ గుర్తు చేసాడు ఆది. ఒక సెంచరీ కొట్టేసి తానే సచిన్ టెండూల్కర్‌ను దాటేసామంటే ఎలా.. అలాంటిది ఆయన వంద కొట్టాడు.. అందుకే మురిసిపోకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తన కన్నా చిన్న ఆర్టిస్టులను ఇలా చులకన చేసి హైపర్ ఆది మాట్లాడటంతో నాగబాబు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. సక్సెస్ తలకు ఎక్కడం మంచిది కాదని, చిన్న స్థాయినుంచి మెగాస్టార్ కు ఎదిగిన చిరంజీవి ఇప్పటికీ, కొత్త స్టార్స్ వస్తే చాలా గౌరవిస్తారని, అలాంటిది హైపర్ ఆది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 5 సంవత్సరాలకే తానో పెద్ద స్టార్ అయినట్లు ప్రవర్తించడం తగదని నాగబాబు హెచ్చరించినట్లు సమాచారం.

Related posts