telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నటుడి వివాహం… విరాళంగా పెళ్లి ఖర్చు

actor

నటుడు, కేరళ ఫిల్మ్‌ అవార్డ్‌ విజేత మణికందన్‌​ ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన కొచ్చిలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి వచ్చిన వారంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించారు. ఆరు నెలల క్రితమే మరదుకు చెందిన అంజలితో మణికందన్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్‌ 26న పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అయితే పెళ్లి తేదీని మార్చటానికి మణికందన్‌ ఇష్టపడలేదు. కానీ, ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెళ్లి ఘనంగా చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే పెళ్లి కోసం వెచ్చించాల్సిన డబ్బు మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 2016లో వచ్చిన కమ్మటిపడ సినిమాతో మణికందన్‌ సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కేరళ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు.

Related posts