ప్రస్తుతం ఎన్నో మారణహోమాలకి పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే కారకులు అవుతున్నారని. అలాంటి ఉగ్రవాదులకి మద్దతు ఇవ్వడం ఏ మాత్రం క్షమించే విషయం కాదని అమెరికా సీనియర్ సెనేటర్ మ్యాగి హాసన్ అన్నారు. ఉగ్రవాదులుకి మీరు చేస్తున్న సాయాన్ని కాని, మద్దతు కానీ వెంటనే నిలిపివేయాలని ఆమె హెచ్చరించారు. తాలిబన్ల తో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల్ని నివారించడానికి తప్పకుండా మాకు పాక్ సాయం కావాలని అందుకు పాక్ సహకరించాలని ఆమె అన్నారు.
మ్యాగి హాసన్ కాశ్మీర్ అంశంపై కూడా స్పందించారు. కాశ్మీర్ అంశం మేము కలిపించుకునేంత చిన్న విషయం కాదని, ఇది చాలా పెద్ద సమస్యని తెలిపారు. ఇరుదేశాలు శాంతి కోసం సంయమనం పాటించాలని ఆమె కోరారు. ప్రస్తుతం పాక్ లో పర్యటించిన ఆమె మరొక సెనేటర్ త్వరలో భారత్ వెళ్లనున్నారు. ఉగ్రవాదంపై భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనే విషయంపై భవిష్యత్తు ప్రణాలికలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై ఆమె చర్చించనున్నారని తెలుస్తోంది.
విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాలి: పంచుమర్తి అనురాధ