telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డబ్బు కంటే ప్రేమకే ఎక్కువ విలువిస్తా : పాయల్

payal

RX100 సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయతో ఆమె చేసిన రొమాన్స్ కేక పెట్టించింది. ఆతరువాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి తనలోని టాలెంట్ అంతా బయటపెట్టేసింది పాయల్. ఈమె ప్రస్తుతం తన హోమ్ క్వారంటైన్ సమయాన్ని సరదాగా గడుపుతోంది. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. మొన్ననే ‘పిల్లో ఛాలెంజ్’ అంటూ సెగలు రేపే పిక్ షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా అభిమానులతో ఆన్‌లైన్ చాట్ చేస్తూ డేటింగ్ సంగతులపై ఆసక్తికరంగా స్పందించింది.

RX100 హీరో కార్తికేయతో డేటింగ్‌ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారనే ప్రశ్నకి బదులిచ్చిన పాయల్.. కార్తికేయ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పింది. తెలుగు హీరోల్లో విజయ్ ‌దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది పాయల్. అలాగే రజినీకాంత్‌తో అవకాశం వస్తే చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. తాను డబ్బు కంటే ప్రేమకే ఎక్కువ విలువిస్తానని, అందరితో స్నేహంగా ఉండటంలో ఉన్న సరదాయే వేరని పాయల్‌ రాజ్‌పుత్ తెలిపింది‌. అలాగే క్రికెటర్లలో తనకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం పాయల్.. 5W అనే విలక్షణ కథాంశంలో నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

Related posts