సౌత్ ఆఫ్రికాలో ఓ వ్యక్తి అత్యుత్సాహానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. సరదాగా జూకు వెళ్లిన భార్యాభర్తలు సింహం బోను దగ్గర ఆగారు. పీటర్ అనే వ్యక్తి అత్యుత్సాహంతో బోనులో చేయి పెట్టి సింహాన్ని నిమరడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మరో ఆడ సింహం అక్కడకు రాగా… దాన్ని కూడా నిమిరే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆడ సింహం పీటర్ చేయి పట్టుకుని తినడానికి యత్నించింది. అతి కష్టం మీద సింహం నోట్లో నుంచి చేయి బయటకు లాక్కుని పీటర్ ప్రాణాలతో బయటపడ్డాడు. చేతికి తీవ్ర గాయాలవగా పీటర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జరిగిందంతా పీటర్ భార్య వీడియో తీయగా.. ఈ వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. పీటర్‌పై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా నడుపుతున్నా ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదని.. ప్రమాద హెచ్చరిక బోర్డులు ప్రతి చోట ఏర్పాటు చేశామని జూ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై తాము ఎటువంటి చర్చలు తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.
previous post
next post
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్