telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అఖిలప్రియ హౌస్ అరెస్ట్.. పోలీసులపై ఆగ్రహం

ఛలో ఆత్మకూర్ కు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్ ఉన్న ఆమెను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకోవడంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు జగత్ విఖ్యాత్ రెడ్డి గదిని కూడా పోలీసులు సోదా చేశారు. దీంతో అఖిలప్రియ పోలేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts