telugu navyamedia
రాజకీయ వార్తలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుల్లో.. 40 వేల మంది సైనికుల మోహరింపు!

army nepal

ఇటీవలే తూర్పు లడఖ్‌ సరిహద్దు వద్ద చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గాల్వన్‌లోయ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు మరవకముందే అరుణాచల్‌ ప్రదేశ్‌ మెక్‌మెహన్‌ రేఖ వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రాంతం వద్ద సుమారు 40 వేల మంది సైనికులను చైనా మోహరించిందని సమాచారం.

మెక్‌మెహన్‌ రేఖ దిశగా చైనా సైన్యం కదలికలతో భారత్ అప్రమత్తమైంది. బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడంతో డ్రాగన్ దేశం దుందుడుకు చర్యలకు పాల్పడితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండేందుకు భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. గగనతల రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామగ్రితో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు బలగాలు, ఇతర యుద్ధ సామగ్రిని తరలిస్తోంది.దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రిజర్వ్‌ బలగాలను సమీకరిస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts