telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రైల్వే ఉద్యోగులపై .. దుష్ప్రచారం.. వివరణ ఇచ్చిన రైల్వే శాఖ..

Railway Hostes in train journey

సామజిక మాధ్యమాల పుణ్యమా అని ఏది నిజమో, ఏది అసత్యమో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు అందరూ. తాజాగా, ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఒక ప్రచారం జోరుగా సాగింది. ప్రైవేట్ ఉద్యోగులను ఎలా తొలగిస్తున్నారో.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను అదికూడా రైల్వే శాఖవారిని .. అదికూడా 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు, 55 ఏళ్లు నిండిన ఉద్యోగులలో విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని వారితో స్వచ్చంద పదవీ విరమణ చేయించడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి వారిని గుర్తించి తమకు తెలపాలని ప్రాంతీయ కార్యాలయాలకు రైల్వే శాఖ లేఖలు రాసిందంటూ వార్తలొచ్చాయి. దీంతో ఉద్యోగులలో అభద్రతా భావం నెలకొంది.

ఈ అసత్య ప్రచారం పై రైల్వే శాఖ స్పందించి వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. సాధారణ సమీక్షలో భాగంగానే జోనల్ అధికారులకు లేఖలు పంపామని, గతంలో కూడా ఇలాంటి రివ్యూలు చేపట్టినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైల్వే పాలనా యంత్రాంగం ఈ సమీక్ష చేపట్టిందని, దీనిలో భాగంగానే జోన్, ప్రొడక్షన్ యూనిట్లకు లేఖ రాసినట్టు తెలిపింది.

Related posts