telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతును రాజును చేయడమే సీఎం కెసిఆర్ లక్ష్యం

Errabelli Trs

మహబూబాబాద్ జిల్లా పరిధి, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తున్నదని..రైతును రాజు ను చేయడమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనన్ని రైతు పథకాలు మన రాష్ట్రం లోనే అమలు అవుతున్నాయని..సాగు నీరు, 24 గంటలు నాణ్యమైన కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, పంటల కొనుగోలు వంటి అన్ని రైతు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఇంత నిబద్ధతతో పని చేసిన, చేస్తున్న సీఎం లు దేశంలో లేరని…ఇక్కడ సీఎం ధాన్యం కొంటుంటే అక్కడ కేంద్రం అడ్డుకాలు వేస్తున్నదని పేర్కొన్నారు. మద్దతు ధర సహా, ధాన్యం ఎక్కువ కొనవద్దని అంటున్నదని..ఇక్కడ కొందరు, మద్దతు ధర పెంచాలని రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ధాన్యం కొంటున్నయా రైతులు అవగాహన చేసుకోవాలని..చెప్పుడు మాటలు వినొద్దు, రైతులు చెడి పోవద్దని సూచించారు. ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రభుత్వ కార్యాచరణ ను అర్థం చేయాలని..రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు సాగు జరిగిందన్నారు. అలాంటి సీఎం మనకుండటం మన అదృష్టమని..ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.

Related posts