telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి సమంతా చైతు .. కలిసి..

samantha and chaitu again with another movie

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా, శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన ‘మజిలీ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటించిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మంచి హిట్ టాక్‌ను సంపాదించుకోవడంతో చైతూ, సమంత జంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఒక ట్రెండ్ విజయం సాధిస్తే, దానినే మనవాళ్ళు అనుసరిస్తారు అన్న విషయం తెలిసిందేగా. అదే జోష్‌తో ఈ జంట మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి చై, సామ్‌లకు ఓ కథను వినిపించారని, దీనికి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Related posts