telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ టికెట్స్ కు భారీ డిమాండ్..

భారత్​-న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే. 4 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తామని హాంప్‌షైర్ కౌంటీ క్లబ్ ప్రకటించింది. అయితే 4వేల టికెట్లలో ఐసీసీ స్పాన్సర్లు, వాటాదారులకు 50 శాతం వరకు టికెట్లు పోగా.. మరో 2000 టికెట్లను అమ్మకానికి ఉంచుతామని హాంప్ షైర్ క్లబ్ హెడ్ రోడ్ బ్రన్స్ గ్రోవ్ తెలిపాడు. దాంతో టికెట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మెగా ఫైట్ మ్యాచ్ కోసం భారత అభిమానులతో పాటు న్యూజిలాండ్ ఫ్యాన్స్ ఎగబడటంతో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్క టికెట్ ధర గరిష్టంగా రూ.2 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్‌కు కూడా దారి తీసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ట్విటర్‌లో ఈ విషయం చర్చనీయాంశమైంది. 2019 సెప్టెంబర్ తర్వాత ఫ్యాన్స్​ను అనుమతించడం ఇదే తొలిసారి కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు డిమాండ్ పెరిగింది. క్రికెట్ మ్యాచ్‌లు చూసి చాలా రోజులు కావడంతో ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Related posts