telugu navyamedia
రాజకీయ వార్తలు

వ్యాక్సిన్ విషయంలో బీహార్ సంచలన నిర్ణయం…

Nitish kumar Bihar cm

దాదాపు ఏడాదికి పైగా దేశాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే దానికి వ్యాక్సిన్ గత నెల నుండి మ్మన దేశంలో ఇస్తున్నారు. దేశంలో కరోనా వ్యాక్సీనేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.  ఇప్పటికే 1.43 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించారు. ఈరోజు నుంచి దేశంలో రెండో విడత వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఇక ఇండ్ల ఉంటె, బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రజలందరికి ఉచిత కరోనా వ్యాక్సిన్ అందిస్తామని నితీష్ కుమార్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఆ హామీ అమలుకు కట్టుబడి ఉన్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా వ్యాక్సినేషన్ అందిస్తున్నా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోస్ కు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కు ఆ రూ.250 కూడా కట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. చూడాలి మరి ఈ నిర్ణయం మిగితా రాష్ట్రాల పైన ప్రభావం చూపుతుందా… లేదా అనేది.

Related posts