telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు శుభవార్త : ఖాతాల్లోకి 1820.23 కోట్లు విడుదల

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 15.5లక్షల మంది రైతులకు రూ. 1820.23 కోట్ల బీమా పరిహారాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని.. ఈ నెలలోనే రైతుల కోసం రైతు భరోసా కింద నేరుగా వారి ఖాతాల్లోకి 3,928 కోట్లు పంపామని.. ఇదే నెలలోనే 15.5 లక్షల మందికి రైతులకు మేలు జరిగేలా రూ.1820.33 కోట్లు ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెలలోనే రైతులకోసం రూ.5748 కోట్లు ఇవ్వగలిగామని.. మన రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. మనకు ఆహార భద్రతను ఇవ్వడమే కాక 62 శాతం మందికి ఉపాధిని కల్పిస్తోందని.. ఇలాంటి సందర్భాల్లో రైతు బాగుంటేనే, రైతు కూలీ కూడా బాగుంటాడని వెల్లడించారు. 2020 ఖరీఫ్‌లో వర్షాలు, తుపాన్లు, చీడపీడల కారణంగా నష్టపోయిన 15.5 లక్షల మంది రైతులకు ఇప్పుడు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద మేలు జరుగుతోందన్నారు. లంచాలు, వివక్షలేకుండా, పారదర్శకంగా, నేరుగా బటన్‌నొక్కిన వెంటనే రైతన్నఖాతాల్లోకి డబ్బును పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఉగాది రోజున పంచాంగం కర్తలు తెలిపిన విధంగా, వాతావరణ శాఖ చెప్పిన విధంగా కూడా ఈ ఏడాది కూడా చక్కటి వర్షాలు కురిసి రైతన్నలకు మంచి పంటలు పండాలని కోరుకుంటున్నానని సిఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన పరిస్థితిని గమనిస్తే 2018కు సంబంధించిన రఊ.715.84 కోట్లు ఇన్సూరెన్స్‌కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అని దీన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వగలిగామన్నారు సిఎం జగన్.

Related posts