telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలోకి ఈటల..? ఫాంహౌజ్ కేంద్ర మంత్రితో భేటీ

మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే.. ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడి.. అడ్రసు లేకుండా పోయారని మరికొందరి వాదన.  అటు  సిఎం కెసిఆర్ పై బహిరంగంగానే ఈటల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అన్ని పార్టీల నేతలను ఈటల కలుస్తున్నారు. 2023 లో టీఆర్ఎస్ ను పడగొట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈటల. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని ఈట‌ల‌ కలిశారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కిష‌న్ రెడ్డితో ఈట‌ల చర్చించారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో ఈ ఇద్దరు నేత‌లు స‌మావేశ‌ం అయ్యారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డిని ఈటల కలవడం మరో చర్చకు దారితీసింది.  ఈటల బిజేపి లోకి వెళతారా? లేక సొంత పార్టీకె మొగ్గు చూపుతారా ? అనే చర్చ తెరపైకి వస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts