telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకొడుకు ‘దొంగ నా కొడుకు!’… రవితేజ ఆసక్తికర పోస్ట్…

raviteja

లాక్‌డౌన్ సమయంలో తన హోమ్ క్వారంటైన్ విశేషాలు తెలుపుతూ అభిమానులను పలకరిస్తున్నారుమాస్ మహారాజ్ రవితేజ. తన కొడుకు, కూతురులను పరిచయం చేస్తూ ఈ హోమ్ క్వారంటైన్ సమయం ప్రతిరోజు సండేలా గడిచిపోతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టిన రవితేజ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది తన కొడుకు మహాధన్‌తో ఇంట్లో సరదాగా గడుపుతున్న క్షణాన్ని కెమెరాలో బంధించి ఆ పిక్ షేర్ చేశారు. దీనిపై ‘డీఎన్‌కె’ అని ఆయన కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బెడ్‌పై పక్కపక్కనే కూర్చొని అలా రిలాక్స్ అవుతూ సెల్ ఫోన్స్ చూస్తున్న ఫోటో ఇది. దీనిపై ”చెకింగ్ ఆన్ మై డీఎన్‌కె” అని ట్యాగ్ చేయడంతో ఆ ‘డీఎన్‌కె’ అంటే ఏంటో విశ్లేషించే పనిలో పడ్డారు నెటిజన్స్. తన కొడుకు ముద్దుగా దొంగ నా కొడుకు! అంటున్నారని పేర్కొంటూ రిప్లై పెడుతున్నారు. మొత్తానికైతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. విలక్షణ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

View this post on Instagram

 

Checking on my DNK 🤨

A post shared by RAVI TEJA (@raviteja_2628) on

Related posts