చైనాలో పుట్టిన కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారీన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన పేర్కొన్నారు. అయితే.. నడ్డా త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. తాజాగా.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నడ్డా త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. అటు ఇప్పటికే పలువురు బీజేపీ మంత్రులు కరోనా బారీన పడిన విషయం తెలిసిందే.
previous post