telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను సీఎం అభ్యర్థిని కాను… పార్టీ అధ్యక్షుడిని మాత్రమే : రజనీకాంత్

rajani

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు సీఎం అవ్వాలనే ఆసక్తి లేదని పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రం ఉంటానని పేర్కోన్నాడు. పార్టీ సీఎం అభ్యర్థిగా భాగా చదువుకున్న వ్యక్తిని నియమిస్తామని ఈ సందర్భంగా తెలిపాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందని.. ఈ లోటును పూర్చడానికి యువరక్తం రాజకీయాలలోకి రావాలన్నారు. తన పార్టీలో 65 శాతం యువకులకి త‌ప్ప‌క‌ అవ‌కాశం ఉంటుందని.. రిటైర్డ్‌ ఐఏస్‌, ఐపీఎస్‌లని పార్టీలలోకి ఆహ్వానిస్తానని ప్రెస్ మీట్‌లో రజనీకాంత్ పేర్కోన్నాడు. దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలాంటి నిస్వార్థమైన ప్రకటన చేసినందుకు తమిళనాడులో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక సినిమా విషయాలకు వస్తే రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. రజనీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.లేడి సూపర్ స్టార్ నయనతార ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Related posts